జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే..

ABN, Publish Date - Sep 22 , 2024 | 09:28 AM

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దుమారం తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత అపచారం జరిగిందా అంటూ మండిపడుతున్నారు.

అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దుమారం తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత అపచారం జరిగిందా అంటూ మండిపడుతున్నారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లడ్డూ కల్తీపై అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. జగన్, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందేనంటూ అమిత్ షా, సుప్రీం కోర్టు సీజేకు పలువురు లేఖలు రాశారు. అంతే కాకుండా సుప్రీం కోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.


లడ్డూ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక కోరారు. శ్రీవారి ఆలయం శుద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను దేవాదాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. ధరల వివరాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తు్న్నారు. ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే ఆవు నెయ్యిని విజయ, విశాఖ తదితర డెయిరీల్లోని కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated at - Sep 22 , 2024 | 10:03 AM