దొరికిన రెండు బస్తాల డాక్యుమెంట్లు..

ABN, Publish Date - Jul 24 , 2024 | 09:28 AM

అన్నమయ్య జిల్లా: మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటనకు సంబంధించిన విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

అన్నమయ్య జిల్లా: మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డుల దహనం ఘటనకు సంబంధించిన విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి పోలీసుల అదుపులో ఉన్న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేర కు.. పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్న ట్టు తెలిసింది.


మంగళవారం ఉదయం నుంచి పోలీసు లు సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులను విడివిడిగా విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా అడిషనల్‌ ఎస్పీ రాజ్‌కమల్‌ ఆధ్వర్యంలో పది పోలీసు బృందాలు, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐదు రెవెన్యూ బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఆర్డీవో స్థాయి అధికారుల పర్యవేక్షణలో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని 10 మండలాలు, పీలేరు నియోజకవర్గం కలికిరి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను అధికారులు సీజ్‌ చేసి జిల్లా కేంద్రమైన రాయచోటికి తరలించారు. మంగళవారం ఉదయం నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లు ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

షన్ రెడ్డి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది: సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 24 , 2024 | 09:28 AM