అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ

ABN, Publish Date - Nov 22 , 2024 | 07:33 AM

అదానీ సంస్థ ఏపీ ప్రభుత్వంతో 7వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2021 సెప్టెంబర్ 11న అదానీ, ఆయన కుటుంబసభ్యులు విజయవాడ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌తోనే ఉన్నారు. ఆ తర్వాత ఈ ఒప్పందం జరిగింది.

అదానీ గ్రూప్‌పై అమెరికాలో నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఏపీ కీలక నేతలకు ముడుపులు ముట్టాయంటూ అమెరికాలో నమోదైన కేసు ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో వణుకు పుట్టిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ తగిలింది. అమెరికాలో నమోదైన కేసులో సెకీ సోలార్ ఎనర్టీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదానీ చేసుకున్న పునరుత్పాదక విద్యుత్ ఒప్పందం జరిగిన వెంటనే ఆనాటి జగన్ ప్రభుత్వంతో టీపీఏ కుదుర్చుకోవడం వెనుక ముడుపులు ముట్టాయని అమెరికాలో నమోదైన కేసులో వివరించారు.


కేంద్ర సంస్థ సోలార్ ఎనర్టీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ పునరుత్పాదక విద్యుత్‌పై టెండర్లు పిలిచింది. పునరుత్పాదక విద్యుత్ సరఫరా చేస్తామని అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో పెట్టుబడుల కోసం అదానీ సంస్థకు అమెరికా, కెనడాలోని కొన్ని సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చాయి. మొత్తం మూడు బిలియన్ డాలర్లు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. మూడు బిలియన్ డాలర్లు అంటే రూ. 25 వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. డబ్బులు డ్రా చేసేందుకు అప్పట్లో దేశంలోని పలు రాష్ట్రాలలో పునరుత్పాదక విద్యుత్‌పై ఏపీ ప్రభుత్వంతో సహా పలు రాష్ట్రాలతో అదానీ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వంతో 7వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2021 సెప్టెంబర్ 11న అదానీ, ఆయన కుటుంబం విజయవాడ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌తోనే ఉన్నారు. ఆ తర్వాత ఈ ఒప్పందం జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికాతో అట్లుంటది

ఆ ప్రచారంలో నిజం లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 22 , 2024 | 07:33 AM