వైఎస్సార్‌సీపీ పాపాల చిట్టా రెడి..

ABN, Publish Date - Dec 08 , 2024 | 10:52 AM

అమరావతి: ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి.. బాధితులకు న్యాయం చేసి.. దోషులను దండించేలా కూటమి ప్రభుత్వం పకడ్బంధిగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లి నేతల వరకు జరిగిన అరాచకాలపై ఓ నివేదిక సిద్ధమైంది.

అమరావతి: ప్రభుత్వమే మాఫియా అవతారమెత్తితే ఎలా ఉంటుందో గత వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన నేరాలు.. ఘోరాలు.. బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి. వైఎస్సార్‌సీపీ మాఫియాపై ప్రాథమిక ఆధారాలు, సమగ్ర నివేదికలు సిద్ధమవుతున్నాయా.. జగన్ అండ్ కోకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా.. అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చలవిడితనం.. కన్నేసిన ప్రతిదాన్ని కబ్జాచేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. ఇవి జగన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాలనలో జరిగిన దారుణాలు..


జగన్ హయాంలో లూటీయే డ్యూటీగా దోపిడీ జరిగింది. తుపాకీ గురిపెట్టి వేల కోట్ల ఆస్తులు కొట్టేయడమనే ట్రెండ్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు కొనసాగించారు. స్టూడియోలు, హోటళ్లు, కంపెనీలు, గనులు, సెజ్‌లు, పోర్టులు.. ఇలా ఒక్కటేమిటీ అవకాశం ఉన్న ప్రతి చోట.. తమ కన్ను పడిన ప్రతి చోట అన్నింటిని ఆశాంతం మింగేశారు. అయితే చేసిన పాపం ఎంతోకాలం దాగదు అన్నట్లుగా జగన్ అండ్ కో చేసిన పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. ఆ పుట్టుల్లో దాగి ఉన్న అవినీతి అనకొండలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్‌సీపీ కబ్జాలు, అక్రమాలను బద్దలు కొట్టేందుకు పూర్తి స్థాయిలో సీఐడీ దృష్టి సారించింది. విశాఖ నుంచి అనంతవరకు వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన దోపిడీలు, దారుణాలపై ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పోర్టు సెజ్‌లో విలువైన వాటాలను బెదిరించి లాక్కున్న దాంట్లో యాక్షన్ షూరూ అయింది. ప్రాథమిక ఆధారాలు, సమగ్ర నివేధికతో జగన్ అండ్ కోకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతల పోర్టులు, డిస్టలరీలు, ప్రాజెక్టుల కబ్జాలపై విస్తుపోయే, కళ్లుతిరిగే నిజాలు దొరికినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఆర్డీయేలో లంచాల బోగోతం..

బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి

కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్

బోరుగడ్డ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 08 , 2024 | 10:52 AM