Share News

రూ.11.60 కోట్లు తాగేశారు

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:11 AM

ఏడాది ముగింపు వేళ మద్యం ప్రియులు ఫుల్‌ కిక్కు మీద ఉన్నారు. డిసెంబరు 30,31 తేదీల్లో రూ.11.60 కోట్ల మద్యం తాగేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 13,171 ఐఎంఎల్‌ కేస్‌లు, 4,402 బీరు కేస్‌లు ఖాళీ చేయడం ద్వారా ఎక్సైజ్‌ శాఖకు కాసుల వర్షం కురిపించారు. న్యూ ఇయర్‌ వేడుకలను మద్యం మత్తులో హుషారుగా జరుపుకున్నారు.

రూ.11.60 కోట్లు తాగేశారు

2024 డిసెంబరు 30, 31వ తేదీల్లో ఫుల్‌ కిక్కు..!

న్యూ ఇయర్‌ వేళ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

13,171 ఐఎంఎల్‌ కేస్‌లు,

4,402 బీరు కేస్‌లు ఖాళీ

ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా అమ్మకాలు

ఏడాది ముగింపు వేళ మద్యం ప్రియులు ఫుల్‌ కిక్కు మీద ఉన్నారు. డిసెంబరు 30,31 తేదీల్లో రూ.11.60 కోట్ల మద్యం తాగేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 13,171 ఐఎంఎల్‌ కేస్‌లు, 4,402 బీరు కేస్‌లు ఖాళీ చేయడం ద్వారా ఎక్సైజ్‌ శాఖకు కాసుల వర్షం కురిపించారు. న్యూ ఇయర్‌ వేడుకలను మద్యం మత్తులో హుషారుగా జరుపుకున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో మంగళవారం ఒక్కరోజే రూ.11.60 కోట్ల అమ్మకాలు సాగాయి. డిపోల నుంచి 13,171 ఐఎంఎల్‌ కేసులు, 4,396 బీరు కేస్‌లను మద్యం దుకాణాలు కొనుగోలు చేశాయి. 30వ తేదీన 26,304 ఐఎంఎల్‌ కేస్‌లు, 5,596 బీరు కేస్‌లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లు, అమ్మకాల్లో ఎన్టీఆర్‌ జిల్లా టాప్‌లో నిలిచింది. ఎన్టీఆర్‌ జిల్లాలో మద్యం దుకాణాలు మంగళవారం డిపోల నుంచి 8,294 ఐఎంఎల్‌ కేస్‌లు, 2,936 బీరు కేస్‌లు కొనుగోలు చేశాయి. వాటి ద్వారా మొత్తం రూ.7.7 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు వచ్చింది. దీనికి ముందు 30వ తేదీన 15,247 ఐఎంఎల్‌ కేస్‌లు, 2,880 బీరు కేస్‌లను మద్యం వ్యాపారులు డిపోల నుంచి కొనుగోలు చేశారు. వాటి ద్వారా రూ.13.03 కోట్ల ఆదాయం వచ్చింది. కృష్ణాజిల్లాలో 31వ తేదీన 4,877 ఐఎంఎల్‌ కేస్‌లు, 1,466 బీరు కేస్‌లను కొనుగోలు చేశారు. వాటి ద్వారా రూ.3.9 కోట్ల ఆదాయం వచ్చింది. 30వ తేదీన 11,057 ఐఎంఎల్‌ కేస్‌లు, 2,716 బీరు కేస్‌లను డిపోల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. వారి ద్వారా రూ.8.50 లక్షల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు చేకూరింది. సంవత్సరం ముగింపు రెండు రోజుల్లో జిల్లాలోని మద్యం ప్రియులు ఈ కేస్‌లను ఖాళీ చేశారు. ఏడాది ముగింపు రోజున జిల్లాలో విస్తృతంగా విందులు చేసుకున్నారు. అటు బార్లు, ఇటు మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. కొన్నిచోట్ల గ్రూపులుగా పార్టీలు చేసుకున్నారు. ఈ లిక్కర్‌ కిక్‌ నూతన సంవత్సరం తొలి రోజున సాగింది.

ఐఎంఎల్‌కు అధిక ప్రాధాన్యం

సాధారణంగా మద్యం అమ్మకాల్లో బీరుల వాటా అధికంగా ఉంటుంది. వేసవిలో చల్లదనం కోసం బీరులను విపరీతంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండడంతో మద్యం ప్రియులు బీరుల మోతాదును తగ్గించుకున్నారు. లిక్కర్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చల్లని రోజుల్లో వెచ్చదనం కోసం లిక్కర్‌ను ఎంచుకున్నారు. రెండు రోజులపాటు డిపోల నుంచి కొనుగోలు చేసిన కేసులో ఐఎంఎల్‌ కేస్‌లే ఎక్కువ ఉన్నాయి. రెండు రోజుల్లో డిపోల నుంచి మద్యం వ్యాపారులు 39,475 ఐఎంఎల్‌ కేస్‌లు కొనుగోలు చేయడం గమనార్హం.

Updated Date - Jan 02 , 2025 | 01:11 AM