ఆదుకోని ప్రత్యామ్నాయ పంట
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:12 PM
మండల వ్యాప్తంగా ప్రత్యా మ్నాయ పంటగా ఉలం పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అఽధిక వర్షాల వల్ల పంట ఏపుగా పెరిగినా.. గింజలు లేవన రైతులు వాపోతున్నారు.
గాండ్లపెంట, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ప్రత్యా మ్నాయ పంటగా ఉలం పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అఽధిక వర్షాల వల్ల పంట ఏపుగా పెరిగినా.. గింజలు లేవన రైతులు వాపోతున్నారు. ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ సాగుచేసినా... పదేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో వరుస నష్టాలను రైతులు చవి చూశారు. కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో పంటలు సాగుచేయడానికి రైతులు జంకుతున్నారు. గత ఏడాది ఉలవ సాగులో మంచి దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కూడా మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశించి.. దాదాపు 1500 ఎకరాల్లో ఉలవ పంటను సాగుచేశారు. ఉలవ పంట ఏపుగా పెరిగింది. వర్షం రావడంతో కాయలో గింజపట్టడంలేదు. అరకొగా గింజలు పట్టాయని రైతులు వాపోతున్నారు. కనీసం ఉలవ గ్రాసం అయినా దక్కేనా అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.