Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే అమలు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 08:41 PM
ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో టీటీడీ స్వామి వారి దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు తీసుకుని కూడా దర్శనం కల్పించాలని కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి నిర్ణయించారు. 24 నుంచి ఆ పద్దతి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఓ అలెర్ట్..

శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా స్వీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకుని టీటీడీ దర్శనం కల్పించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం.. సోమవారం నుంచి ఈ పద్దతి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఆదివారం రోజున తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు ద్వారా మార్చి 24న స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునే వారు.. ఆదివారం ఆ సిఫార్సులను టీటీడీకి పంపాల్సి ఉంటుంది. ఇక, తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ వారంలో రెండు రోజులు మాత్రమే అనుమతించనుంది.
ఆదివారం, సోమవారం సిఫార్సు లేఖలను తీసుకుని.. సోమ, మంగళవారాలు స్వామి వారి దర్శనం కల్పించనుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం విషయంలోనూ ఇదే రూలు వర్తిస్తుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో బుధ,గురువారాల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనుంది. అది కూడా ఒక ప్రజా ప్రతినిధి ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతించనుంది. ఒక లేఖపై ఆరుగురికి మించకుండా శ్రీవారి దర్శనం కల్పించనుంది. కాగా, మార్చి 30వ తేదీన తిరుమలలో తెలుగు ఉగాది ఆస్థానం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని పురష్కరించుకుని మార్చి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
ఆ హోటళ్లకు అనుమతులు రద్దు
శ్రీవారి ఏడుకొండల్లో వ్యాపారీకరణను అనుమతించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏడు కొండల పరిధిలో గత ప్రభుత్వం హోటళ్ల నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను ఆయన రద్దు చేశారు. శుక్రవారం మనవుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాన్ష్ పేరు మీద అన్నదాన కార్యక్రమానికి 44 లక్షలు విరాళం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ శ్రీ వేంకటేశ్వర స్వామి నా ప్రధమ ప్రాధాన్యం. ఏడుకొండలు శ్రీవారి సొంతం. వాటిని అపవిత్రం చేయకూడదు. అందుకే గత ప్రభుత్వంలో ముంతాజ్, ఏఆర్‌కే, దేవలోక్‌లకు ఇచ్చిన 35.52 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
JAC Meet Delimitation: డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో జేఏసీ తదుపరి భేటీ
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
Delhi Budget: బడ్జెట్‌కు 10 వేల సూచనలు అందాయి: రేఖాగుప్తా