Share News

Amaravati: అమరావతికి సం‘క్రాంతి’ జోష్‌!

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:16 AM

సంక్రాంతి పండగ తర్వాత నుంచి రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి.

 Amaravati: అమరావతికి సం‘క్రాంతి’ జోష్‌!

పండుగ తర్వాత నుంచి పనులు పరుగులు

ఒక్కరోజే రూ.2,323.25 కోట్లతో టెండర్లు

పోటాపోటీగా పిలుస్తున్న సీఆర్డీఏ, ఏడీసీ

22 వరకూ బిడ్లు దాఖలు చేసే అవకాశం

విజయవాడ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండ ుగ తర్వాత నుంచి రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో చేప ట్టే పనులకు సంబంధించి సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) పోటాపోటీగా టెండర్లు పిలుస్తున్నాయి. బుధవారం సీఆర్డీఏ రూ.1,470.68 కోట్లతో, ఏడీసీ రూ.852.57 కోట్లతో కలిపి మొత్తం రూ.2,323.25 కోట్ల పనులకు టెండర్లు పిలిచాయి.

సీఆర్డీఏ టెండర్ల వివరాలివీ..

రాజధానిలో అత్యంత కీలకమైన ట్రంక్‌ ఇన్ర్ఫా పనుల్లో భాగంగా రూ.1,036.36 కోట్ల వ్యయంతో రెండు టెండర్లు పిలిచారు. అమరావతి కేపిటల్‌ సిటీ పరిధిలో జోన్‌-1ఏలోని నెక్కల్లు (పార్ట్‌) గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి సరఫరా, సీవరేజి, పవర్‌-ఐసీటీ యుటిలిటీ డక్ట్స్‌, రీయూజ్‌ వాటర్‌ లైన్స్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ వంటి పను లు చేపట్టడానికి రూ.448.32 కోట్ల వ్యయంతో మొదటి టెండర్‌ పిలిచింది.

జోన్‌-1బీలోని నెక్కల్లు(పార్ట్‌), శాఖమూరు గ్రామాల్లో రూ.588.04 కోట్లతో పై పనులకే టెండర్లు పిలిచింది. రానున్న రోజుల్లో మిగిలిన జోన్ల పరిధిలో కూడా పెద్దఎత్తున ట్రంక్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ పనులకు టెండర్లు పిలవనుంది.

నేలపాడు గ్రామంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు(ఐఏఎస్‌) అధికారులకు సంబంధించి 432 క్వార్టర్లతో కూడిన మొత్తం 18 స్టిల్స్‌ ప్లస్‌ 12 అంతస్తులతో కూడిన మల్టీస్టోర్డ్‌ టవర్లలో ఎలక్ర్టికల్‌, ప్లంబింగ్‌, శానిటరీ, అగ్నిమాపక పరికరాల బిగింపు, లిఫ్ట్‌లు, డీజీ, హెచ్‌వీఏసీ, సెక్యూరిటీ సిస్టమ్‌లు, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటి పనులకు సంబంధించి రూ.434.32 కోట్లతో టెండర్లు పిలిచింది.

ఈ పనులన్నింటికీ సంబంధించి జనవరి 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు. అదేరోజు సాయంత్రం 4గంటలకు సాంకేతిక బిడ్లను తెరుస్తారు.


ఏడీసీ నేతృత్వంలో ఇలా..

అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) నేతృత్వంలో రూ.852.57 కోట్ల వ్యయంతో రెండు టెండర్లు పిలిచారు. నీరుకొండ రిజర్వాయర్‌కు సంబంధించి బాలెన్స్‌ ఫ్లడ్‌ మిటిగేషన్‌ నిర్మాణ పనులను ప్యాకేజీ-3లో భాగంగా రూ.470.75 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. జనవరి 22న మధ్యాహ్నం 3గంటల వరకు కాంట్రాక్టు సంస్థలు బిడ్లను సమర్పించవచ్చు. అదేరోజు సాయంత్రం 5గంటలకు టెక్నికల్‌ బిడ్లను తెరుస్తారు.

అమరావతి కేపిటల్‌ సిటీ ఏరియాలోని ఎన్‌-9 రోడ్డు పరిధిలో రోడ్లు, డ్రెయిన్లు, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు (వరదనీటి మళ్లింపు కాల్వలు), మంచినీటి సరఫరా వ్యవస్థ, సీవరేజి నెట్‌వర్క్‌, విద్యుత్తు-ఐసీటీ యుటిలిటీ డక్ట్స్‌, అవెన్యూ ప్లాంటేషన్లకు సంబంధించి రూ.381.82కోట్లతో టెండర్లు పిలిచింది. జనవరి 22న మధ్యాహ్నం 3.30గంటల వరకు బిడ్లు సమర్పించవచ్చు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు టెక్నికల్‌ బిడ్లు తెరుస్తారు.

Updated Date - Jan 02 , 2025 | 04:16 AM