Share News

Electricity Court విద్యుత అదాలతకు 28 ఫిర్యాదులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:14 AM

స్థానిక మార్కెట్‌ యార్డ్‌ సమీపంలోని విద్యుత సబ్‌స్టేషనలో సోమవారం నిర్వహించిన విద్యుత అదాలతకు 28 ఫిర్యాదులు అందాయి.

 Electricity Court విద్యుత అదాలతకు 28 ఫిర్యాదులు
సమస్యలు వింటున్న అధికారులు

ధర్మవరం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌ యార్డ్‌ సమీపంలోని విద్యుత సబ్‌స్టేషనలో సోమవారం నిర్వహించిన విద్యుత అదాలతకు 28 ఫిర్యాదులు అందాయి. పుట్టపర్తి డివిజన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శివరాములు, విశ్రాంత న్యాయాధికారి శ్రీనివాస, ఆర్థి క సభ్యుడు రామ్మోహనరావు, సాంకేతిక సభ్యుడు అంజనీకుమార్‌, స్వతంత్రసభ్యులు విజయలక్ష్మీ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 28 ఫిర్యాదులు రాగా.. అందులో ఐదింటిని అక్కడికక్కడే పరిష్కరించామని, మిగిలిన 23 ఫిర్యాదులను ఆనలైనలో నమోదు చేశామని శివరాములు తెలిపారు. సంబంధిత అధికారులతో విచారణ చేయించి వాటినీ పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ లక్ష్మీనరసింహారెడ్డి, ఏఓ రామస్వామి, ఏఈలు నాగభూషణం, కొండారెడ్డి రజానకీరామయ్య, శివయ్య, రవి పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:14 AM