Easter ఘనంగా ఈస్టర్ పండుగ
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:25 PM
మండలంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ఆదివారం ఘనంగా పునరుత్థాన (ఈస్టర్) పండుగను నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 20: మండలంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ఆదివారం ఘనంగా పునరుత్థాన (ఈస్టర్) పండుగను నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వెంగళమ్మచెరువు హోలీసిటీ చర్చిలో పాస్టరు మైకేల్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు.
ఓబుళదేవరచెరువు : స్థానిక సీఐఅండ్‌ఐజీ మిషన చర్చిలో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి బాలరాజు, సభ్యులు సునిల్‌కుమార్ పాల్గొన్నారు.