Share News

rdt ఘనంగా ఫాదర్‌ ఫెర్రర్‌ జయంతి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:32 AM

ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్‌ వినసెంట్‌ ఫెర్రర్‌ 105వ జయంతి సందర్భంగా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలోని ఫాదర్‌ ఘాట్‌ వద్ద ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అన్నె ఫెర్రర్‌ బుధవారం ఘనంగా నివాళులర్పించారు.

rdt ఘనంగా ఫాదర్‌ ఫెర్రర్‌ జయంతి
ఫాదర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పిస్తున్న అన్నె ఫెర్రర్‌

బత్తలపల్లి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్‌ వినసెంట్‌ ఫెర్రర్‌ 105వ జయంతి సందర్భంగా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలోని ఫాదర్‌ ఘాట్‌ వద్ద ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ అన్నె ఫెర్రర్‌ బుధవారం ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీ ప్రమీల, నిర్వహణ మేనేజర్‌ హనుమంతరెడ్డి పాల్గొన్నారు.


ధర్మవరంరూరల్‌: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్‌ ఫెర్రర్‌ 105వ జయంతి వేడుకలను మండలంలోని గొట్లూరు, రేగాటిపల్లి, నేలకోటతండాతో పాటు పలుగ్రామాల్లో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్డీటీ బత్తలపల్లి ఆసుపత్రి ప్రతినిధి శర్మ, అనంతపురం ఆర్డీటీ ప్రధానకార్యాలయ ప్రతినిధి ప్రసన్న హాజరయ్యారు. పలు గ్రామాల్లో ఆర్డీటీ సంస్థ మహిళ సంఘాలు ఏర్పాటు చేసిన హుండీలను పగలగొట్టి ఆ డబ్బును విరాళంగా ఇచ్చారు.


కదిరి: నల్లచెరువులోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో ఫెర్రర్‌ జయంతిని వినాయక వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, రెడ్డెప్ప, ఎస్‌ రెడ్డెప్ప, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:32 AM