joins TDP వైసీపీ మాజీ కన్వీనర్ టీడీపీలో చేరిక
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:24 PM
వైసీపీ రూరల్ మండల మాజీ కన్వీనర్ కటికల ప్రకాష్ వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కదిరి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ రూరల్ మండల మాజీ కన్వీనర్ కటికల ప్రకాష్ వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అతనికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు టీడీపీలో చేరారు. ఆయన పది సంవత్స రాల పాటు వైసీపీలో రూరల్ కన్వీనర్‌గా పనిచేశారు. ఆయన కు టుంబ సభ్యులు ఎంపీటీసీగా, నీటిపారుదల శాఖ డైరెక్టర్‌గా పని చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న అభి వృద్ధి చూసి పార్టీలో చేరినట్లు ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు ఓరాది చంద్ర, పీవీఆర్ గణేష్, మనోహర్, నాయకులు పాల్గొన్నారు.