Share News

Gas గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:21 PM

కేంద్రం పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

Gas గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి
కదిరి : నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కేంద్రం పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో గ్యాస్‌ సిలిండర్లతో నిరసన తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లకు, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏకంగా రూ.50 పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జీఎల్‌ నరసింహులు, జగన్మోహన, బాబ్‌జాన, ముస్తాక్‌, రామమోహన, రమణమ్మ, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


తాడిమర్రి : గ్యాస్‌, పెట్రోల్‌ ధరల పెంపుపై సీఐటీయూ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:21 PM