Share News

Waqf Board వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:18 AM

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో సోమవారం ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనికి సీపీఐ, సీపీఎం, వైసీపీ నాయకులు, క్రైస్తవులు మద్దతు పలికారు.

 Waqf Board  వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ
శాంతిర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు

ధర్మవరం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో సోమవారం ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దీనికి సీపీఐ, సీపీఎం, వైసీపీ నాయకులు, క్రైస్తవులు మద్దతు పలికారు. ఈ ర్యాలీ జామీయా మసీదు నుంచి కళాజ్యోతి, ఎన్టీఆర్‌, గాంధీనగర్‌ సర్కిల్‌ మీదుగా తిరిగి కాలేజ్‌ సర్కిల్‌కు చేరింది. పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లింలకు ఒక్క ఎంపీ సీటు కేటాయించని బీజేపీ ప్రభుత్వం.. వారి ఆస్తులను కాపాడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. క్రైస్తవులు, ముస్లింల విలువైన భూములను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయడానికి బీజేపీ పన్నాగం పన్నుతోందన్నారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, సీపీఐ నియోజకవర్గకార్యదర్శి మధు, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం సీనియర్‌ నాయకులు ఎస్‌హెచబాషా, వైసీపీ నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:18 AM