Plant మొక్కల ధ్వంసం
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:13 AM
మండలంలోని సంజీవపురా నికి చెందిన బీజేపీ నాయకుడు సురేంద్రకు చెందిన రెండు ఎకరా ల్లోని 580 దానిమ్మ మొక్కలను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
బత్తలపల్లి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని సంజీవపురా నికి చెందిన బీజేపీ నాయకుడు సురేంద్రకు చెందిన రెండు ఎకరా ల్లోని 580 దానిమ్మ మొక్కలను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం తోటకు వెళ్లిన సురేంద్ర.. విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరు నెలల క్రి తం ఈ మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. విషయం తెలు సుకున్న బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీష్‌బాబు ఆ తోటను పరిశీలించారు. కారకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఫోన ద్వారా కోరారు. కేసు దర్యాప్తులో ఉంది.