Protest rally ఉగ్రదాడులపై నిరసన ర్యాలీ
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:35 PM
జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ టీడీపీ నాయకులు శుక్రవారం కాగడాలతో పట్టణంలో శాంతిర్యాలీ నిర్వహించారు
ధర్మవరం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గామ్‌లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ టీడీపీ నాయకులు శుక్రవారం కాగడాలతో పట్టణంలో శాంతిర్యాలీ నిర్వహించారు. కళాజ్యోతి సర్కిల్‌కు చేరుకుని అక్కడ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య, నాయకులు చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్, చింతపులుసు పెద్దన్న, రాంపురం శీన, అంబటి సనత, పల్లపు రవీంద్ర, అడ్రమహేశ, బొట్టుకిష్ట,జింకల రాజన్న, సాయి, చిన్నూరు విజయ్‌చౌదరి పాల్గొన్నారు.