Share News

MLA ప్రజాసమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:55 AM

స్థానిక వెంకటసాయి ఐటీఐ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రజల నుంచి 238 వినతులు స్వీకరించారు.

MLA ప్రజాసమస్యలను పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): స్థానిక వెంకటసాయి ఐటీఐ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రజల నుంచి 238 వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వీడాలని అధికారులకు సూచించారు. మామిళ్లకుంట్లపల్లి నుంచి ఓడీచెరువు వరకు ఉన్న దారిని వెడల్పు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోని పేదలకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని బీజేపీ మండల కన్వీనర్‌ వీరాంజనేయులు, అమడగూరు, నల్లమాడ, ఓడీసీ మండలాలకు కలిపి ఓడీసీలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, గ్రామ కార్యదర్శి సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకుడు విశ్వనాథ్‌రెడ్డి ఎమ్మెల్యేను కోరారు. అనంతరం విద్యుత సబ్‌స్టేషనలో రైతులకు విద్యుత ట్రా న్సఫార్మర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 12:55 AM