Rathostavam వైభవం.. మల్లీశ్వరుడి రథోత్సవం..
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:31 PM
కంబదూరులో వెలసిన మల్లీశ్వర స్వామి రథోత్సవం అశేష భక్తజనం నడుమ శుక్రవారం వైభవంగా సాగింది. మల్లేశ్వరస్వామి రథోత్సవాన్ని గ్రామంలోని పురవీధుల గుండా ఓం నమఃశివాయ అనే మంత్రంతో భక్తులు గ్రామస్తులు కలసి రథాన్ని లాగారు.
కళ్యాణదుర్గం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కంబదూరులో వెలసిన మల్లీశ్వర స్వామి రథోత్సవం అశేష భక్తజనం నడుమ శుక్రవారం వైభవంగా సాగింది. మల్లేశ్వరస్వామి రథోత్సవాన్ని గ్రామంలోని పురవీధుల గుండా ఓం నమఃశివాయ అనే మంత్రంతో భక్తులు గ్రామస్తులు కలసి రథాన్ని లాగారు. స్థానిక పాత బస్టాండు నుంచి పోస్టాఫీసు సర్కిల్ మీదుగా కోటవీధి వరకు మల్లేశ్వరస్వామి రథోత్సవం అత్యంత కన్నుల పండువగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు రథోత్సవాన్ని తిలకించేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి సేవలో పాలుపంచుకున్నారు. శనివారం ఉట్లమాను పరుష కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.