Share News

MLA భూసమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:26 AM

నియోజకవర్గ వ్యాప్తంగా భూ, ఆస్తి తగాదాలే అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు, పోలీసులు వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సూచించారు.

MLA భూసమస్యలు పరిష్కరించండి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే

పుట్టపర్తిరూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ వ్యాప్తంగా భూ, ఆస్తి తగాదాలే అధికంగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులు, పోలీసులు వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 162 ఫిర్యాదులను ఎమ్మెల్యే స్వీకరించారు. రెవెన్యూ, పోలీసులు న్యాయబద్ధంగా ఈ సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కొత్తచెరువు తహసీల్దారు నీలకంఠారెడ్డి, పుట్టపర్తి డిప్యూటీ తహసీల్దార్‌ కళ్యాణ్‌, రూరల్‌సీఐ సురేష్‌, పట్టణ సీఐ సునీత, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:26 AM