Share News

Sewage రోడ్లపై మురుగునీరు నిల్వ

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:29 PM

స్థానిక హిందూ శ్మశాన వాటిక సమీపంలోని వీధుల్లో 15 రోజులుగా మురుగునీరు నిల్వ ఉంటోంది.

Sewage  రోడ్లపై మురుగునీరు నిల్వ
కోకనట్‌ గ్రూవ్‌ సమీపంలోని రోడ్డుపై నిల్వ ఉన్న మురుగు

పుట్టపర్తిరూరల్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): స్థానిక హిందూ శ్మశాన వాటిక సమీపంలోని వీధుల్లో 15 రోజులుగా మురుగునీరు నిల్వ ఉంటోంది. దీనిపై పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. మురుగునీటి దుర్వాసన భరించలేకపోతున్నామని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:29 PM