Solve problems రైతుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:40 PM
రైతులకు 1బి అడంగల్ సమస్యలను పరిష్కరించాలని టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జ్జి తుమ్మల మనోహర్ తహసీల్దార్ నారాయణస్వామిని విజ్ఞప్తి చేశారు.
ముదిగుబ్బ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రైతులకు 1బి అడంగల్ సమస్యలను పరిష్కరించాలని టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జ్జి తుమ్మల మనోహర్ తహసీల్దార్ నారాయణస్వామిని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన, టీడీపీ నాయకులు, రైతులతో తహసీల్దార్‌ను కలిశారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా రైతులకు 1బి అడంగల్ ఆన్లైనలో రావడం లేదని, రైతులు పంట రుణాల రెన్యువల్‌కు ఇబ్బందులు పడుతున్నారని, తహసీల్దార్ మ్యానువల్‌గా ఇచ్చినా 1బి అడంగల్ బ్యాంక్ అధికారులు అంగీకరించడం లేదని అన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. బ్యాంక్ అధికారులు, వీఆర్వో, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని, సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లె నారాయణస్వామి, తుమ్మల సూరి, బాలకృష్ణ, బాలరాజు, బాలచంద్ర, కరుణాకర్, వెంకటనారాయణ, వెంకటపతి పాల్గొన్నారు.