ration dealers రేషన డీలర్ల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:34 AM
రేషన డీలర్ల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నాయకులు అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు.

ధర్మవరం రూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రేషన డీలర్ల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ నాయకులు అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు. ధర్మవరం మండలంలోని డీలర్లు టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ ఇనచార్జి మహే్‌షచౌదరి ఆధ్వర్యంలో తహసీల్దార్ నటరాజకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బఫర్ స్టాకు సమస్యతో ప్రస్తుతం డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి నెలా బఫర్‌స్టాకుతో రేషనబియ్యం తక్కువ క్వింటాళ్లు సరఫరా చేస్తున్నారని, ఇలాగైతే ప్రజలకు ఎలా పంపిణీ చేసేదని వాపోయారు. ప్రతినెలా రేషన బియ్యంలో స్టాకు తక్కువగా వస్తున్నాయని, ప్రతి బస్తా మీద నాలుగు నుంచి ఐదు కేజీలకు పైగా తక్కువగా వస్తున్నాయన్నారు. రేషనషాపులకు తగినంతగా బియ్యం సరఫరా చేసి డీలర్ల సమస్యను పరిష్కారించాలని తహసీల్దార్‌ను కోరారు. ఇందులో టీడీపీ మండల కన్వీనర్ పోతుకుంట లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి విజయసారథి, రాఘవరెడ్డి, నేలకోట రామ్మోహనరెడ్డి, నారాయణస్వామి, చెలిమి నాగానంద, రామకృష్ణ, బాలప్ప, చెన్నప్ప, రామాంజినేయులు, నరసింహులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ: తమ సమస్యలు పరిష్కరించకుంటే రేషనను పంపిణీ చేయలేమని మండలంలోని రేషన డీలర్లు వాపోయారు. ఈ మేరకు టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జి తుమ్మల మనోహర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో సీఎ్‌సడీటీ మునిస్వామికి మంగళవారం వినతిపత్రం ఇచ్చిన వారు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన బియ్యం బఫరింగ్‌ను అధికారులు జీరో చేయకపోవడంతో రేషన బియ్యం తక్కువగా వస్తున్నాయన్నారు. బఫర్‌ను జీరో చేయాలని, స్టాక్ పాయింట్‌లో సరిగా తూకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.