Share News

Suparintendent of police ప్రజాఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:09 AM

ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు సమర్పించే అర్జీలపై సత్వరమే విచారణ చేపట్టి, చట్టపరిధిలో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రత్న.. సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.

Suparintendent of police ప్రజాఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ రత్న

పోలీసు అధికారులకు ఎస్పీ రత్న ఆదేశం

పుట్టపర్తిరూరల్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు సమర్పించే అర్జీలపై సత్వరమే విచారణ చేపట్టి, చట్టపరిధిలో ఉన్న వాటిని సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రత్న.. సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజలు 60 ఫిర్యాదులు సమర్పించారు. వాటిని ఎస్పీ స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సంబందిత పోలీసు అదికారులతో ఫోనలో మాట్లాడి చట్టపరిధిలో ఉన్న వాటికి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్‌, మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:09 AM