tank work నీటి తొట్టెల పనులు ప్రారంభం
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:03 PM
మండలంలోని టి.సదుం గ్రామంలో పశువుల నీటి తొట్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం భూమి పూజ చేసి ప్రారంభించారు.
తనకల్లు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని టి.సదుం గ్రామంలో పశువుల నీటి తొట్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అలాగే అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల ప్రహరీని ప్రారంభించారు. కొక్కంటి క్రాస్ నుంచి బాలసముద్రం, టి.సదుం మీదుగా కొక్కంటి రోడ్డు వరకు రహదారి నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రెడ్డిశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌నాయుడు, ఫణీకర్‌రెడ్డి, చలపతి, నాయకులు పీజీ మల్లికార్జున, నాగభూషణం, శ్రీధర్‌రెడ్డి, చంద్రారెడ్డి, షబ్బీర్, నాయకులు, కార్యకర్తలు, అన్నిశాఖలాధికారులు పాల్గొన్నారు.