Share News

Santur Muthyala Muggulu,: ఏపీలో ముగ్గుల పోటీ ఫైనల్స్‌ నేడే

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:22 AM

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు..

 Santur Muthyala Muggulu,: ఏపీలో ముగ్గుల పోటీ ఫైనల్స్‌ నేడే

విజయవాడ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) తుది అంకానికి చేరుకున్నాయి. తుది విజేతలు ఎవరో తేల్చే ఫైనల్స్‌ శనివారం విజయవాడలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగాను, తమిళనాడు, కర్ణాటకల్లోను సుమారు 40 కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి ముగ్గుల పోటీలు ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో జరిగాయి. ఆరు వేల మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ప్రథమ స్థానం సాధించిన వారినుంచి 15 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. వీరంతా విజయవాడలో జరిగే ఫైనల్స్‌లో పోటీ పడనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.30,000, మూడు ద్వితీయ బహుమతులు రూ.10,000 చొప్పున అందజేస్తారు. మరో ఆరుగురికి కన్సొలేషన్‌ బహుమతులు ఉంటాయి. పోటీల్లో పాల్గొనే అందరికీ స్పాన్సర్ల నుంచి గిఫ్ట్‌ హ్యాంపర్లు కూడా లభిస్తాయి. కొందరు సినీ, రాజకీయ, అధికార ప్రముఖులు ఈ ఫైనల్స్‌కు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.

Updated Date - Jan 11 , 2025 | 04:22 AM