Share News

AP Official Tribute Calendar: రాష్ట్ర కార్యక్రమాల క్యాలెండర్‌ విడుదల

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:11 AM

రాష్ట్ర ప్రభుత్వం 22 మంది ప్రముఖుల జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహించేందుకు ప్రత్యేక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి

AP Official Tribute Calendar: రాష్ట్ర కార్యక్రమాల క్యాలెండర్‌ విడుదల

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రముఖుల జయంతి, వర్ధంతులను రాష్ట్ర కార్యక్రమాలుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక క్యాలెండర్‌ విడుదల చేసింది. 22 మంది ప్రముఖుల జయంతి, వర్ధంతులను నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డె ఓదన్న జయంతి (జనవరి 11), త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి (జనవరి 15), యోగి వేమన జయంతి (జనవరి 19), శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ రోజు (మాఘశుద్ధ విదియ), దామోదర సంజీవయ్య జయంతి (ఫిబ్రవరి 14), ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి (ఫిబ్రవరి 22), కె.అత్కూరి మొల్లమాంభ (మొల్ల) జయంతి (మార్చి 13), పొట్టి శ్రీరాములు జయంతి (మార్చి 16), పుట్టపర్తి నారాయణ ఆచార్యులు జయంతి (మార్చి 28), డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి (ఏప్రిల్‌ 5), మహాత్మా జ్యోతిబా పూలే జయంతి (ఏప్రిల్‌ 11), డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14), మహాత్మా బసవేశ్వర జయంతి (అక్షయ తృతీయ రోజు), అల్లూరి సీతారామరాజు జయంతి (జూలై 4), వర్ధంతి (మే 17), బళ్లారి రాఘవ జయంతి (ఆగస్టు 2), టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి (ఆగస్టు 23), శ్రీ విశ్వకర్మ జయంతి (సెప్టెంబరు 17), మహర్షి వాల్మీకి జయంతి (ఆష్వయుజ పౌర్ణమి), మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి (నవంబరు 11), కనకదాసు జయంతి (నవంబరు 18) నిర్వహించాలని ప్రభుత్వ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చివరగా డిసెంబరు 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 06:11 AM