Share News

Anil Ambani : అనకాపల్లి జిల్లాలో భూములు పరిశీలించిన అనిల్‌ అంబానీ

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:36 AM

రిలయన్స్‌ గ్రూపు సంస్థల అధినేత అనిల్‌ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ పరిధిలోని సీతపాలెం, సెటమెట్ట గ్రామాల పరిసరాల్లోని భూములను పరిశీలించారు. సోలార్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు

Anil Ambani : అనకాపల్లి జిల్లాలో భూములు పరిశీలించిన అనిల్‌ అంబానీ

సోలార్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం

అనకాపల్లి/రాంబిల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్‌ గ్రూపు సంస్థల అధినేత అనిల్‌ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ పరిధిలోని సీతపాలెం, సెటమెట్ట గ్రామాల పరిసరాల్లోని భూములను పరిశీలించారు. సోలార్‌ ప్యానళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం అనిల్‌ అంబానీ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఏపీఐఐసీ గతంలో సేకరించిన 1,500 ఎకరాలను అనిల్‌ అంబానీ విద్యుత్‌ సంస్థకు కేటాయించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ భూములను, సముద్ర తీర ప్రాంతాన్ని అనిల్‌ అంబానీ పరిశీలించారు. ఆయన వెంట ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, అనకాపల్లి ఆర్డీఓ ఆయుషా, ఏపీఐఐసీ జెడ్‌ఎం హరిప్రసాద్‌, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 06:36 AM