Liquor Scam: కిక్కు లెక్క తేల్చేస్తారు!
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:11 AM
ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్- ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, మంగళగిరిలోని సీఐడీ అదనపు ఎస్పీ ఆర్. శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు కె.శివాజీ, సీహెచ్ నాగశ్రీనివా్‌సను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ మద్యం దోపిడీపై ‘సిట్’ ఏర్పాటు
సారథిగా బెజవాడ కమిషనర్ రాజశేఖర్‌బాబు
టీమ్‌లో ‘రెడ్’ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బరాయుడు
మరో ఐదుగురు పోలీసు అధికారులు కూడా
అయ్యన్నార్ పర్యవేక్షణ..
ప్రతి శాఖా సిట్‌కు సహకరించాలి
ఎక్కడైనా సోదాలు చేయొచ్చు..
ఆధారాలూ సీజ్ చేయొచ్చు
ఎవరినైనా ప్రశ్నించవచ్చు..
అవసరమైతే అరెస్టూ చేయొచ్చు
పూర్తి అధికారాలు అప్పగింత..
ప్రతి 15 రోజులకు డీజీపీకి నివేదిక
గత సెప్టెంబరులో నమోదైన కేసు దర్యాప్తు ఇక వేగవంతం
రూ.3,113 కోట్ల కమీషన్ల బాగోతాన్ని వెలికితీయనున్న సిట్
జగన్ హయాంలో అడ్డగోలుగా జరిగిన మద్యం దోపిడీ మూలాలను తవ్వి తీసేదిశగా కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని 2019 అక్టోబరు నుంచి ఎన్నికల ముందు వరకు దోచేసిన వేల కోట్లకు సంబంధించిన అసలు లబ్ధిదారులకు ఉచ్చు బిగించే నిర్ణయం తీసుకుంది.
అంతా చిక్కుకున్నట్లే!
సూత్రధారి రాజ్ కసిరెడ్డి, మిథున్‌రెడ్డి,
సాయిరెడ్డి తదితరులకు శ్రీముఖాలు?
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో అడ్డగోలుగా సాగిన మద్యం దోపిడీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. దీనికి విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు (ఐజీ ర్యాంకు) సారథ్యం వహిస్తారు. ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్- ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, మంగళగిరిలోని సీఐడీ అదనపు ఎస్పీ ఆర్. శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు కె.శివాజీ, సీహెచ్ నాగశ్రీనివా్‌సను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దోపిడీ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హోదాలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఈ నెల 1న ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే నిరుడు సెప్టెంబరులో సీఐడీ నమోదు చేసిన కేసు(21/2024) విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టిన సర్కారు.. మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి తాజాగా సిట్‌ను నియమిస్తూ జీవో జారీచేసింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో విచారణ జరపాలని.. కేసు దర్యాప్తులో రాష్ట్రంలోని ప్రతి శాఖా సిట్‌కు తగు సహకారం అందించాలని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్‌ఎ్‌సఎస్)-2023 మేరకు పూర్తి అధికారాలున్న సిట్‌కు సాంకేతికంగా ఎలాంటి సమాచారం కావాలన్నా అందించాలని పేర్కొంది. సిట్‌కు పూర్తి అధికారాలు అప్పగించింది. పోలీసు స్టేషన్ హోదా కూడా కల్పించింది. కేసు దర్యాప్తు వివరాలు, ఇతరత్రా వెలికి తీసిన అంశాలను సీఐడీ డీజీతోపాటు డీజీపీకి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో పేర్కొంది.
కమీషన్లు ఇస్తేనే మద్యం ఆర్డర్లు..
ప్రజలను మద్యానికి దూరం చేస్తున్నామంటూ.. భారీగా లిక్కర్ ధరలు పెంచేసి.. కమీషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చిన వైసీపీ పెద్దల బాగోతాన్ని.. కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా గత సెప్టెంబరు చివరి వారంలో కేసు నమోదు చేసిన సీఐడీ మరింత సమాచారం సేకరించింది. పాపులర్ మద్యం బ్రాండ్లను తరిమేసి.. నాసిరకం జే బ్రాండ్లు తెచ్చి షాపులకు సరఫరా చేసినట్లు గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా ప్రతి బాక్స్‌పై కనీసం రూ.150 నుంచి గరిష్ఠంగా రూ.450 వరకూ నాటి ప్రభుత్వ పెద్దలు వసూలు చేసినట్లు ఆఽధారాలు సేకరించింది. వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి (ఈయన ఇటీవల వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేశారు) ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా ప్రతి వారం ఒక వాహనంలో కమీషన్ డబ్బులు తీసుకొచ్చి ప్యాలెస్ పెద్దలు చెప్పిన చోటకు చేర్చినట్లు గుర్తించింది. జగన్ పాలనలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ ఆ భారీ నల్లధనాన్ని హవాలా రూపంలో ముఖ్య నేతకు చేర్చిన వైనాన్ని కనిపెట్టింది.
డిస్టిలరీలు కబ్జా..
అధికారంలోకొచ్చిన వెంటనే మద్యం దోపిడీపై దృష్టి సారించిన జగన్ అండ్ కో.. మొదట మద్యం డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుంది. ఏపీలోనే పెద్దదైన నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌సతోపాటు దాదాపు అన్నింటినీ గుప్పిట్లోకి తెచ్చుకుంది. నాణ్యమైన పాపులర్ బ్రాండ్లను తరిమేసి.. ఆయా డిస్టిలరీల్లో నాసిరకమైన ‘జే’ బ్రాండ్లు ఉత్పత్తి చేయించింది. కమీషన్లు ఇచ్చిన వారికి మాత్రమే రూ.వేల కోట్ల మద్యం ఆర్డర్లు ఇప్పించింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ వద్ద 235 కంపెనీలు మద్యం సరఫరాకు నమోదై ఉండగా.. వాటిలో ఏడింటికి మాత్రమే రూ.9,221 కోట్ల ఆర్డర్లు ఇప్పించారు. ఎస్‌ఎ్‌సజే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్‌కు రూ.2,876 కోట్లు.. ఎస్పీపై ఆగ్రోస్ ఇండస్ట్రీస్-1,569 కోట్లు.. తిలక్‌నగర్ ఇండస్ట్రీస్-1,472 కోట్లు.. సెంటినీ బయో ప్రొడక్ట్స్-1,132 కోట్లు.. ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్-983 కోట్లు.. ఆదాన్ డిస్టిలరీస్-739 కోట్లు.. లీలా డిస్టిలరీ్‌సకు రూ.450 కోట్ల మేర ఇచ్చిన ఆర్డర్ల వెనుక భారీగా అవినీతిని గుర్తించింది.
అడ్డగోలు వసూళ్లు 3,113 కోట్లు
వ్యవస్థీకృత మాఫియాగా ఏర్పడిన జే గ్యాంగ్ సభ్యులు మద్యం కుంభకోణంలో రూ.3,113 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే తేలింది. ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరో వచ్చి కోడ్ చెప్పి మాఫియా తరహాలో తీసుకెళ్లిన వైనం నుంచి హవాలా వరకూ ఎవరి పాత్ర ఎంత అనేదానిని ఇక సిట్ తేల్చనుంది. తెరవెనుక సూత్రధారి రాజ్ కసిరెడ్డి నుంచి నేరు గా ప్రమేయమున్న మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి వరకూ అందరికీ శ్రీముఖాలు పంపే అవకాశాలున్నాయి. విదేశీ సిమ్‌లు వాడి ప్రకాశ్ కాలింగ్ పేరుతో వసూలు చేసిన వ్యక్తుల నుంచి నగదు తీసుకెళ్లిన వ్యక్తుల గుట్టు రట్టు చేయబోతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సొంత బ్రాండ్లతోపాటు ఇచ్చిన భారీ ఆర్డర్ల వెనకున్న రహస్యాన్ని సిట్ ఛేదిస్తుందని పేర్కొన్నాయి
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh : జగన్ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..