Share News

డీఎస్సీ విడుదల హర్షణీయం: ఆప్టా

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:38 AM

ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) మెగా డీఎస్సీ విడుదలపై హర్షం వ్యక్తం చేసింది. టీచర్‌ పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల పాఠశాల విద్యాశాఖ నిస్థేజంగా మారిందని పేర్కొంది

డీఎస్సీ విడుదల హర్షణీయం: ఆప్టా

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ విడుదలపై ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం(ఆప్టా) హర్షం వ్యక్తం చేసింది. టీచర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడంతో గత కొన్నేళ్లుగా పాఠశాల విద్యాశాఖ నిస్తేజంగా మారిందని, ఇచ్చిన మాటప్రకారం మెగా డీఎస్సీ విడుదల చేయడం హర్షణీయమని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్‌ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 03:38 AM