Share News

అట్టహాసంగా అంతర్రాష్ట్ర గిరక లాగుడు పోటీలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 11:31 PM

మ్మిగనూరు మండల పరిధిలోని గుడికల్లు గ్రామంలో సోమవారం అంతర్రాష్ట్ర గిరకలాగు పోటీలు అట్టహాసంగా జరిగాయి.

అట్టహాసంగా అంతర్రాష్ట్ర గిరక లాగుడు పోటీలు
పోటీలో తలపడుతున్న వృషభాలు

ఎమ్మిగనూరు రూరల్‌, జనవరి13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడికల్లు గ్రామంలో సోమవారం అంతర్రాష్ట్ర గిరకలాగు పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతల నుంచి 18ఎద్దుల జతలు వచ్చాయి. పోటీలను వైసీపీ సీనియర్‌ నాయకులు, గ్రామ పెద్ద వై.రుద్రగౌడు ప్రారంభించారు. గుడికల్లు గ్రామానికి చెందిన చాకలి నల్లయ్య ఎద్దులు పది నిమిషాల్లో 3516.8 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి రూ.30వేలను కైవసం చేసుకున్నాయి. అలాగే గుడికల్లు గ్రామానికి చెందిన కొండయ్య ఎద్దులు 3,395.7 అడుగులు లాగి రెండవ బహుమతి రూ.25వేలను, గుడికల్లు గ్రామానికి చెందిన ఆకుల మంగయ్య ఎద్దులు 3,388.3 అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతి రూ.20వేలను, నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన ఈరన్న ఎద్దులు 3,381 అడుగుల దూరం లాగి నాల్గవ బహుమతి రూ.15వేలను, దేవనకొండ మండలం గుమ్మరాళ్ల పాలకుర్తి గ్రామానికి చెందిన ఉసేని ఎద్దులు 3,350 అడుగల దూరం లాగి ఐదవ బహుమతి రూ.10వేలను, అలాగే ఆస్పరి మండలం ఒలకొండ గ్రామానికి చెందిన ఈరన్న ఎద్దులు 3,242.2 అడుగుల దూరం లాగి 6వ బహుమతి రూ.8వేలను కైవసం చేసుకున్నాయి. అలాగే ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామానికి చెందిన చాకలి నల్లన్న ఎద్దులు 3,167.3 అడుగుల దూరం లాగి ఏడవ బహుమతి రూ.5వేలను దక్కించుకున్నాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే గాక వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, రైతులు తరలివచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రూరల్‌ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గెలుపొందిన ఎద్దుల యజమానులకు వైసీపీ సీనియర్‌ నాయకులు వై.రుద్రగౌడు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాధవస్వామి, ఖాజా, నిర్వాహకులు పెద్దమాదవస్వామి, ఆకుల మంగయ్య, రంగన్న, చాకలి శ్రీను, బజారి, ఉలిగప్ప, నాగేష్‌, నరసమ్మ, నల్లయ్య, వీరేంద్ర, నల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 11:31 PM