Chandrababu Naidu: బిల్‌గేట్స్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 02:19 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీలో సమావేశం అయిన ఈ ఇద్దరూ పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించటం కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీల అధిపతులను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో వీరిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించడానికి ఒప్పుకుంది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు.
గేట్స్ నో అన్నా చంద్రబాబు నిరాశ పడలేదు..
దాదాపు 30 ఏళ్ల క్రితం తొలిసారి చంద్రబాబు నాయుడు, బిల్స్‌గేట్స్‌ను కలవాలనుకున్నారు. అందుకు బిల్‌గేట్స్ కార్యాలయం నుంచి నో అనే సమాధానం వచ్చింది. అయినా చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలాగా మళ్లీ మళ్లీ ప్రయత్నించారు. అప్పుడు ఓ చిన్న అవకాశం దొరికింది. బిల్‌గేట్స్ కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నిరాశపడలేదు. దాన్నో అద్భుతమైన అవకాశంగా మార్చుకుని ఏపీ మీద తనకున్న ప్రేమను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను, ప్రణాళికలను బిల్‌గేట్స్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చంద్రబాబు ప్రజెంటేషన్‌తో బిల్‌గేట్స్ ముగ్ధుడయ్యాడు. 10 నిమిషాల సమావేశం 45 నిమిషాల వరకు సాగింది.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మరో నేత జంప్
Read Latest AP News And Telugu News