Share News

పండుగ ఇళ్లలోనే జరుపుకోండి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:28 PM

భారతదేశంలో హెచఎంపీవీ కేసుల సంఖ్య 17కి చేరాయి.

 పండుగ ఇళ్లలోనే జరుపుకోండి

ఫ హెచఎంపీవీ కేసుల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి

ఫ కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో హెచఎంపీవీ కేసుల సంఖ్య 17కి చేరాయి. హెచఎంపీవీ కేసులు మెల్లమెల్లగా ఎక్కువ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైరస్‌ నేపథ్యంతో సంక్రాంతి పండుగను అందరూ ఇళ్లలోనే ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. హెచఎంపీవీ వైరస్‌ విషయంలో భయపడాల్సిన పని లేదని, రద్దీ ఉన్న ప్రాంతాలు, జన సమూహాల్లోకి వెళ్లేటప్పుడు తప్పక మాస్కులు ధరించాలన్నారు. చేతులు శుభ్రంగా చేసుకోవాలని, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆయాసం, న్యూమోనియా వంటి శ్వాస సంబంధిత జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. హెచఎంపీవీ వైరస్‌ కొత్తది కాదని, పాతదేనని, ప్రాణాపాయం ఉండదని వెల్లడించారు. కొవిడ్‌ ముందస్తు జాగ్రత్తల మాదిరిగానే చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్లు కడుక్కోవాలని అన్నారు. కర్నూలు జీజీహెచలో ముందస్తు చర్యలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఓల్డ్‌ గైనిక్‌లో 20 పడకలతో ఐసొలేషన వార్డును ఏర్పాటు చేశామన్నారు. అలాగే మరో పది పడకలను నెగిటివ్‌ ప్రెజర్‌ రూంలో సిద్ధం చేస్తున్నామన్నారు. వైరస్‌ లక్షణాలతో వచ్చే వారికి పరీక్షలు చేసి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:28 PM