Share News

తిరుమల ఘాట్‌లో మరో కారులో మంటలు

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:21 AM

రెండురోజుల కిందట తిరుమల రెండో ఘాట్‌లో కారు మంటల్లో కాలిపోయిన ఘటన మరువక ముందే సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది.

తిరుమల ఘాట్‌లో మరో కారులో మంటలు

తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రెండురోజుల కిందట తిరుమల రెండో ఘాట్‌లో కారు మంటల్లో కాలిపోయిన ఘటన మరువక ముందే సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగుప్రయాణమైన భక్తుల కారు ఇంజన్‌ నుంచి రాత్రి 11.15 గంటలకు మంటలు చెలరేగాయి. భక్తులు వెంటనే అప్రమత్తమై నీళ్లు చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి ఘాట్‌లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated Date - Apr 22 , 2025 | 01:21 AM