Share News

స్కూల్‌గేమ్స్‌లో అవకతవకలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:34 AM

జిల్లాలో ఇటీవల నిర్వహించిన స్కూల్‌గేమ్స్‌ టోర్నమెంట్లలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, ఫిర్యాదులపై విచారణ ప్రారంభమైంది. గురువారం చిత్తూరులోని డీఈవో కార్యాలయానికి రీజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ భానుమూర్తి రాజు నేతృత్వంలో విచారణాధికారుల బృందం వచ్చింది. స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ వసంతవాణితో పాటు టోర్నమెంట్‌ నిర్వహణలో భాగస్వాములైన పీడీలను విచారించారు.వసంతవాణితో పాటు పలువురు పీడీలు స్కూల్‌ గేమ్స్‌ టోర్నమెంట్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు డీఈవో వరలక్ష్మికి ఇటీవల పలువురు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు.బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు చిత్తూరు ఎంపీ నుంచి డీఈవోకు ఫిర్యాదులు అందాయి.

స్కూల్‌గేమ్స్‌లో అవకతవకలు
-విచారణ చేస్తున్న ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు

- 28అంశాలపై ఆరోపణలు, ఫిర్యాదులు

- చిత్తూరులో విచారణ చేపట్టిన ఆర్‌ఐపీఈ

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల నిర్వహించిన స్కూల్‌గేమ్స్‌ టోర్నమెంట్లలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, ఫిర్యాదులపై విచారణ ప్రారంభమైంది. గురువారం చిత్తూరులోని డీఈవో కార్యాలయానికి రీజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ భానుమూర్తి రాజు నేతృత్వంలో విచారణాధికారుల బృందం వచ్చింది. స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ వసంతవాణితో పాటు టోర్నమెంట్‌ నిర్వహణలో భాగస్వాములైన పీడీలను విచారించారు.వసంతవాణితో పాటు పలువురు పీడీలు స్కూల్‌ గేమ్స్‌ టోర్నమెంట్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు డీఈవో వరలక్ష్మికి ఇటీవల పలువురు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు.బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు చిత్తూరు ఎంపీ నుంచి డీఈవోకు ఫిర్యాదులు అందాయి. వీటిపై డీఈవో ప్రాథమిక నివేదిక తయారు చేసి ఆర్జేడీ కార్యాలయానికి పంపారు.ఆర్జేడీ శామ్యూల్‌ ఈ వ్యవహారాలపై ఆర్‌ఐపీఈని విచారణ అధికారిగా నియమించారు. స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా జిల్లాలో అండర్‌ -14,17,19 విభాగాల్లో మూడు టోర్నమెంట్లు నిర్వహించారు. యాదమరిలో రెజ్లింగ్‌, అరగొండలో సాఫ్ట్‌బాల్‌, పూతలపట్లులో త్రోబాల్‌ టోర్నమెంట్లు నిర్వహించారు. చిత్తూరు బాస్కెట్‌ బాల్‌, హిందూపురంలో నిర్వహించిన వాలీబాల్‌ టోర్నీలకు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పీడీలు రెఫరీలుగా వ్యహరించారు. తిరుపతికి చెందిన పీడీ నూర్‌ మహ్మద్‌తో పాటు జిల్లాకు చెందిన పీడీలు కృష్ణయ్య, సిరాజ్‌, రవి, బాబులపై వచ్చిన ఆరోపణలపై సైతం విచారణ చేపట్టారు. స్కూల్‌ గేమ్స్‌ నిర్వహణలో భోజన సౌకర్యం, ఇతర అవసరాలకై పలువురు పీడీలు స్థానిక ంగా దాతల నుంచి డబ్బులు వసూలు చేసి ఖర్చు చేశారు. అయితే వీటిని లెక్కల్లో చూపకుండా స్కూల్‌ గేమ్స్‌ నిధుల నుంచి రికవరీ చేయడానికి రూ.2 లక్షలకు సంబంధించి ఏకంగా జీఎస్టీ బిల్లులు సమర్పించడంపై విచారణ మొదలైంది. హిందూపురంలో నిర్వహించిన వాలీబాల్‌ క్రీడల్లో సెలక్షన్‌ కమిటీలోని పీడీలు నూర్‌ మహ్మద్‌, సిరాజ్‌ నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్ని కాకుండా వారికి అనుకూలమైన వారిని ఆడించినట్లు తిరుపతికి చెందిన పలువురు డీఈవోకు ఫిర్యాదు చేశారు. అనుకూలమైన క్రీడాకారుల్ని ఆడించడానికి పైరవీలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాధులపై విచారణ చేశారు. జిల్లాలో నిర్వహించిన టోర్నమెంట్లలో అక్కడి పీడీలు దాతల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు క్రీడల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన క్రీడల్లో రెఫరీలు, సెలక్షన్‌ కమిటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన పీడీలు ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని పక్కన పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు.క్రీడల నిర్వహణలో జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలు జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులపై విచారణ చేపట్టి నివేదికను ఆర్జేడీకి సమర్పిస్తానని ఆర్‌ఐపీఈ తెలిపారు.

Updated Date - Apr 18 , 2025 | 12:34 AM