ఎంపీపీ, రెండు ఉపసర్పంచుల ఎన్నిక ప్రశాంతం
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:37 AM
జిల్లాలో గురువారం ఒక ఎంపీపీ, రెండు ఉపసర్పంచుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి మూడు చోట్లా పరిస్థితిని బట్టి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
తిరుపతిరూరల్/చంద్రగిరి/ఎర్రావారిపాళెం, మార్చి27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఒక ఎంపీపీ, రెండు ఉపసర్పంచుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి మూడు చోట్లా పరిస్థితిని బట్టి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి రూరల్ ఎంపీపీగా వైసీపీకి చెందిన మూలం చంద్రమోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో టీటీడీ తరపున అభ్యర్థి పోటీలో లేరు. ఈ ఎన్నికల జరిగిన రూరల్ ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో షాపులను మూయించేశారు. రాకపోకలను ఆపేశారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ముంబైలో క్యాంపులో ఉన్న వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ఉదయాన్నే విమానంలో దిగారు. ప్రత్యేక బస్సులో వచ్చి ఓటేశారు. ఇక, చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉపసర్పంచ్ ఎన్నికకు ఏడుగురు వార్డు సభ్యులు హాజరయ్యారు. వీరంతా టీడీపీ మద్దతుదారైన వెంకటరమణను ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. ఇక, ఎర్రావారిపాలెం మండలం చింతగుంట ఉప సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు జూపూడి అన్నపూర్ణ ఎన్నికయ్యారు.