Share News

‘మనమిత్ర వాట్సా్‌ప’లో ఇంటర్‌ ఫలితాలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:23 AM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.

‘మనమిత్ర వాట్సా్‌ప’లో ఇంటర్‌ ఫలితాలు

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌లో 15,639 మంది, సెకండియర్‌లో 15,074 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సా్‌పలోనూ అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం 95523 00009 వాట్సాప్‌ నెంబరుకు హాయ్‌ అని పెడితే సెల్‌ఫోన్‌లోనే ఫలితాలు చూడొచ్చు.

Updated Date - Apr 12 , 2025 | 01:23 AM