Share News

జేఈఈ మెయిన్స్‌లో జయకేతనం

ABN , Publish Date - Apr 20 , 2025 | 02:11 AM

జేఈఈ మెయిన్స్‌-2 ఫలితాలు వెలువడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించిన ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్స్‌లో జయకేతనం

మెరుగైన ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్‌-2 ఫలితాలు వెలువడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించిన ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఓపెన్‌ కేటగిరీలో శ్రీకాళహస్తికి చెందిన ఎం.భానుచరణ్‌రెడ్డి 99.99 పర్సంటైల్‌తో 158వ ర్యాంకు పొందారు. 99.98 పర్సంటైల్‌తో తిరుపతికి చెందిన మణిదీప్‌రెడ్డి 274, మహేష్‌ 298, కృష్ణవంశీ 331 ర్యాంకులు సాధించారు. 99.98 పర్సంటైల్‌తో చిత్తూరుకు చెందిన నిఖిల్‌ 386, తిరుపతికి చెందిన జశ్వంతి 458వ ర్యాంకు పొందారు. 99.97 పర్సంటైల్‌తో చిత్తూరుకు చెందిన ధనుష్‌ 466, 99.97 పర్సంటైల్‌తో అనంతపురం పెనుగొండకు చెందిన హిమేష్‌ రాఘవచంద్ర 502వ ర్యాంకు సాధించారు. ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో 99.938 పర్సంటైల్‌తో పూర్వపు ఉమ్మడి జిల్లా తంబళ్లపల్లి మండలం కుక్కరాజపల్లి విద్యార్థిఅరుణ్‌కుమార్‌రెడ్డి 82, వంశీకృష్ణారెడ్డి 98 ర్యాంకులు పొందారు. బాలికల విభాగంలో 99.90 పర్సంటైల్‌తో తిరుపతికి చెందిన యశ్విత 1535వ ర్యాంకు సాధించి గ్రేటర్‌ రాయలసీమలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది.

Updated Date - Apr 20 , 2025 | 02:11 AM