అలిపిరిలో వాహనాల బారులు
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:16 AM
తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ సోమవారం వాహనాలతో కిక్కిరిసిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ అలిపిరి తనిఖీ కేంద్రం మాత్రం వాహనాలతో రద్దీగా మారిపోయింది.
తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ సోమవారం వాహనాలతో కిక్కిరిసిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ అలిపిరి తనిఖీ కేంద్రం మాత్రం వాహనాలతో రద్దీగా మారిపోయింది. సొంతవాహనాల్లో తిరుమలకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోవడంతో పాటు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో పటిష్టమైన భద్రతా తనిఖీలు చేపడుతున్నారు. ఈక్రమంలో అలిపిరి కేంద్రం ముందు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు క్యూకట్టాయి. గరుడ సర్కెల్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి