Share News

యూట్యూబ్‌లో చూసి బైకుల దొంగతనాలు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:03 AM

తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. జులాయిగా తిరిగాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీమనీ సంపాదించాలని యూట్యూబ్‌లో మోటార్‌సైకిళ్ల దొంగతనాలు చూసి దొంగగా మారాడు. ఎట్టకేలకు తిరుచానూరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌ఐ అరుణ గురువారం రాత్రి మీడియాకు తెలిపిన వివరాలు ఇలా.. పూతలపట్టుకు చెందిన గోపి(19) జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచివచ్చేశాడు. ద్విచక్ర వాహనాలు ఎలా దొంగతనం చేయాలో యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. రెండు రోజుల నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోటారుసైకిళ్ల, సెల్‌ఫోన్ల వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. గురువారం తిరుచానూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చైతన్యపురం వద్ద నిందితుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 12 మోటారు సైకిళ్లు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న సీఐ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐ అరుణ, సాయినాథ్‌చౌదరిలను ఎస్పీ హర్షవర్థన్‌రాజు అభినందించారు.

యూట్యూబ్‌లో చూసి బైకుల దొంగతనాలు

- పూతలపట్టు యువకుడి అరెస్టు

తిరుచానూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. జులాయిగా తిరిగాడు. జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీమనీ సంపాదించాలని యూట్యూబ్‌లో మోటార్‌సైకిళ్ల దొంగతనాలు చూసి దొంగగా మారాడు. ఎట్టకేలకు తిరుచానూరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌ఐ అరుణ గురువారం రాత్రి మీడియాకు తెలిపిన వివరాలు ఇలా.. పూతలపట్టుకు చెందిన గోపి(19) జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచివచ్చేశాడు. ద్విచక్ర వాహనాలు ఎలా దొంగతనం చేయాలో యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. రెండు రోజుల నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోటారుసైకిళ్ల, సెల్‌ఫోన్ల వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. గురువారం తిరుచానూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చైతన్యపురం వద్ద నిందితుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 12 మోటారు సైకిళ్లు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న సీఐ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐ అరుణ, సాయినాథ్‌చౌదరిలను ఎస్పీ హర్షవర్థన్‌రాజు అభినందించారు.

Updated Date - Apr 18 , 2025 | 01:03 AM