Share News

CM Chandrababu: 1600 మందికి రూ.24.16 కోట్లు లబ్ధి

ABN , Publish Date - Jan 02 , 2025 | 04:29 AM

నూతన సంవత్సరం తొలిరోజున బుధవారం సీఎం చంద్రబాబు పేదలకు ప్రయోజం కలిగించే సీఎం సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ఫైలుపై సంతకం చేశా రు. ఒకేసారి 1600 మందికి రూ.24.16 కోట్ల నిధులు విడుదల కానున్నాయి.

 CM Chandrababu: 1600 మందికి రూ.24.16 కోట్లు లబ్ధి

నూతన సంవత్సరం తొలిరోజు సీఎంఆర్‌ఎఫ్‌ ఫైలుపై చంద్రబాబు సంతకం

కూటమి ప్రభుత్వంలో 9,123 మందికి లబ్ధి

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం తొలిరోజున బుధవారం సీఎం చంద్రబాబు పేదలకు ప్రయోజం కలిగించే సీఎం సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) ఫైలుపై సంతకం చేశా రు. ఒకేసారి 1600 మందికి రూ.24.16 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిసెంబరు 31 వరకూ రూ.100 కోట్లకు పైగా సాయం చేసింది. తాజాగా చంద్రబాబు సంతకంతో మరో రూ.24.16 కోట్లు విడుదల కానున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 9,123 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రయోజనం పొందారు.

Updated Date - Jan 02 , 2025 | 04:29 AM