Share News

CM Chandrababu: ఊపిరి పోసుకున్న అమరావతి.. జగన్ కుట్రలకు చెక్ ..

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:58 PM

ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అయితే.. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యయం అమాంతం పెరిగింది.

CM Chandrababu: ఊపిరి పోసుకున్న అమరావతి.. జగన్ కుట్రలకు చెక్ ..
Amaravati

కూటమి ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధి పరుగు పెడుతోంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర రాజధాని ఊపిరి పీల్చుకుంటోంది. ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. జగన్ రెడ్డి హయాంలో వైసీపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. రివర్స్ టెండరింగ్ పేరుతో ఐదేళ్లు కాలయాపన చేసింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినా.. గాలికి వదిలేసింది. ఫలితంగా అందులో ఫ్లాటులు కొన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వ రాకతో ప్రాజెక్టుకు ఊపిరి మొదలైంది. ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఎన్‌సీసీ ఈ ప్రాజెక్ట్ 930 కోట్లతో దక్కించుకుంది.


వైసీపీ నిర్లక్ష్యంతో పెరిగిన వ్యయం..

జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యయం అమాంతం పెరిగింది. నిర్మాణ ప్రదేశంలో చేరిన నీటిని తోడివేసే కార్యక్రమం జరుగుతోంది. పది రోజుల్లో ఇది పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒప్పందం ప్రకారం అన్ని రకాల సదుపాయాలను కల్పించి, డిసెంబర్ 2021 నాటికే స్వాధీనం చేయాల్సి ఉంది. జగన్ రెడ్డి ప్రభుత్వం రాగానే గుత్త సంస్థతో ఒప్పందం రద్దయింది. 654.44 కోట్లతో సీఆర్డీఏ మూడు సార్లు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అయినప్పటికి గుత్తేదారులు ఆసక్తి చూపించలేదు. జాప్యానికి గాను పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని పలువురు కొనుగోలు దారులు పోరాటానికి దిగారు. ప్రాజెక్టు పూర్తయ్యే కాలం వరకు దీన్ని వర్తింపజేయాలని దాదాపు 60 మంది వరకు పోరాటం చేస్తున్నారు.


నిర్మాణంలో జాప్యం కారణంగా పెరిగిన వ్యయాన్ని కొనుగోలు దారులపై వేయోద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో 2018లో ఫ్లాట్ బుక్ చేసుకున్న ధరకే కొనుగోలు దారులకు అందించనున్నారు. ఈ భారం సీఆర్డీఏ భరించనుంది. సీఆర్డీఏ తుళ్లూరు మండలం నేలపాడులో 2018లో 12 టవర్లతో మొత్తం 1200 ఫ్లాట్ల చొప్పున 14.46 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టింది. 18 ఫ్లోర్లను నిర్మించాలన్నది ప్రణాళిక. 714 కోట్ల రూపాయల ప్రాజెక్టును షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. ఫ్లాట్లను కొనెందుకు జనం పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. 1,183 మంది ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. మొదటి వాయిదా 93.48 కోట్లు చెల్లించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..

CM Chandrababu: పొట్టి శ్రీరాములు జయంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated Date - Mar 16 , 2025 | 06:15 PM

News Hub