Share News

డెయిరీ చైర్మన ఎన్నిక వాయిదా

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:04 AM

మండలంలోని చిన్నవంగలి గ్రామంలోని పాల డెయిరీ చైర్మన ఎన్నిక వాయిదా వేసినట్లు మేనేజర్‌ ఈశ్వరయ్య తెలిపారు.

   డెయిరీ చైర్మన ఎన్నిక వాయిదా

చాగలమర్రి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నవంగలి గ్రామంలోని పాల డెయిరీ చైర్మన ఎన్నిక వాయిదా వేసినట్లు మేనేజర్‌ ఈశ్వరయ్య తెలిపారు. ఈనెల 3న చిన్నవంగలి గ్రామంలో జరిగిన పాల డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేశారు. తిరిగి చాగలమర్రిలోని పాల కేంద్రం వద్ద శనివారం తాత్కాలిక పాల డెయిరీ చైర్మన ఎన్నిక కోసం ఇరువర్గాలకు చెందిన పాల డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. అయితే టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందిన డైరెక్టర్ల కోరం లేకపోవడంతో వాయిదా వేసినట్లు మేనేజర్‌ పేర్కొన్నారు. తిరిగి ఎన్నికల తేదీ ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 12:04 AM