Share News

రావణ వాహనంపై దేవదేవుడు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:04 AM

శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఐదో రోజు ఘనంగా నిర్వహించారు.

   రావణ వాహనంపై దేవదేవుడు
రావణవాహనంపై విహరించిన దేవదేవులు

వైభవంగా గోపూజ

కనుల పండువగా లీలా కల్యాణోత్సవం

నేడు యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ

శ్రీశైలం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఐదో రోజు ఘనంగా నిర్వహించారు. బుధవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు రావణవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. లోకకళ్యాణ ం కోసం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అనంతరం చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, జపాలు, రుద్ర పారాయణాలు, చతుర్వేద పారాయణాలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రావణవాహనంపై ఆశీనులను చేసి క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవం ఎదుట కళాకారులు, డప్పు వాయిద్యాలు, కళాకారుల శంఖు, డమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకుంది. గ్రామోత్సవంలో స్వామి, అమ్మవార్లను భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో దేవస్థానం ఽకార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.

ఫ ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు మంగళవారం సంక్రాంతి పర్వదినం రోజున

సాయంత్రం స్వామి, అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు లీలా కల్యోణత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల కల్యాణోత్సవానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి నూతన వసా్త్రలను, వెదురు బియ్యం, ఆకులతో తయారు చేసిన బాసికాలు, స్వామివారి యజ్ఞోపవీతం, అమ్మవారి వడ్డాణం, ఇతర సామగ్రిని సమర్పించారు.

ఫ శాస్త్రోక్తకంగా గో పూజా మహోత్సవం

కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని గో పూజా మహోత్సవాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. నిత్య గో సేవతో పాటు ఆవులకు, దూడలకు పూజలు జరిపారు. అనంతరం గోవులకు నూతన వసా్త్రలు సమర్పించారు.

ఫ నేడు యాగ పూర్ణాహుతి, ధ్వజావరోహణ

ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి అనంతరం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచనం కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం ధ్వజపటాన్ని అవరోహణ చేస్తారు.

Updated Date - Jan 16 , 2025 | 12:04 AM