వైసీపీలో విభేదాలు
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:37 PM
మద్దికెర వైసీపీలో విభేదాలు నెలకొన్నాయి. శిలాఫలకంలో సర్పంచ పేరు లేకపోవడంతో ఈ విభేదాలు బట్టబయలయ్యాయి.
శిలాఫలకంలో పేరు లేదని పగులకొట్టే యత్నం
మద్దికెర, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మద్దికెర వైసీపీలో విభేదాలు నెలకొన్నాయి. శిలాఫలకంలో సర్పంచ పేరు లేకపోవడంతో ఈ విభేదాలు బట్టబయలయ్యాయి. మద్దికెర మెయిన బజారులో రూ.22 లక్షలతో నాబార్డు, పంచాయతీ నిధులతో కలిపి నాబార్డు కూరగాయల మార్కెట్ ప్రారంభ శిలాఫలకం వేయించారు. అయితే అందులో ఉప సర్పంచ ప్రమీలమ్మ పేరు లేకపోవడంతో ఆమె భర్త రామాంజులు, అనుచరులు ఆ శిలాఫలకాన్ని పగులకొట్టేందుకు యత్నించారు. వ్యాపారుల సౌకర్యార్థం కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను 2వ తేదీన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేయించిన శిలాఫలకంలో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కాంట్రాక్టర్ల పేర్లన్నీ ఉన్నాయి. గ్రామ ఉప సర్పంచ ప్రమీలమ్మ పేరు మాత్రం వేయించలేదు. దీంతో ఆగ్రహించిన భర్త రామాంజులు శిలాఫలకాన్ని రాళ్లతో పగులగొట్టగా నెర్రెలిచ్చింది. ఒకే పార్టీలో ఉంటూ అందరి పేర్లు వేసి కావాలనే తమ పేరు రాయలేదంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌తో వాగ్వాదానికి దిగాడు. గ్రామంలో ముగ్గురు ఎంపీటీసీల పేర్లు వేసినప్పుడు, తమ పేర్లు ఎందుకు వేయలేదని నిలదీశాడు.