విహారయాత్రకు వెళ్లి...
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:38 AM
చింతూరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా సీలేరు నదిలో ఆదివారం సాయ ంత్రం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వివ రాల ప్రకారం.. చింతూరుకు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రలో భాగంగా చింతూ రు మండలం కల్లేరు సమీపంలోని సీలేరు నది ఒడ్డుకు వెళ్లారు. వారిలో సుగ్రీవ శ్రీను (25
సీలేరు నదిలో ఇద్దరు యువకుల గల్లంతు
చింతూరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా సీలేరు నదిలో ఆదివారం సాయ ంత్రం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వివ రాల ప్రకారం.. చింతూరుకు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రలో భాగంగా చింతూ రు మండలం కల్లేరు సమీపంలోని సీలేరు నది ఒడ్డుకు వెళ్లారు. వారిలో సుగ్రీవ శ్రీను (25), నాగుల దిలీప్ (25) ప్రమాదవశాత్తు ఉధృత ంగా ప్రవహిస్తున్న సీలేరు నదిలో గల్లంత య్యారు. ఈ విషయాన్ని మిగిలిన నలుగురు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భర త్, ఏఎస్పీ పంక జ్‌కుమార్ మీనా, ఎస్‌ఐ రమేష్ తది తరులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చీకటి పడడంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం చేపట్టే ప్రయత్నాలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడిందని, దీంతో సోమవారం ఉదయం కూడా గాలింపు చేపట్టనున్నట్టు ఎస్‌ఐ రమేష్ ఆంధ్రజ్యోతికి తెలిపారు.