Share News

చంపుతామంటూ బెదిరించి దోపిడీ చేసిన నలుగురి అరెస్టు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:34 AM

కోటనందూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి స్పైసీ హోటల్‌ వద ్ద ఈనెల 22న తెల్లవారుజామున ఇద్దరు యువకులను చంపుతామం టూ బెదిరించి వారి వద్ద దోచుకొన్న వస్తువులతో పరారైన ఆరుగురు వ్యక్తుల్లో నలుగురుని కోటనందూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అల్లాది నాగేంద్రసాయి, గాలంకి కిరణ్‌బాబు లంబ

చంపుతామంటూ బెదిరించి దోపిడీ చేసిన నలుగురి అరెస్టు
కోటనందూరు పోలీస్‌స్టేషన్‌లో నిందితులు

పరారీలో మరో ఇద్దరు

కోటనందూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి స్పైసీ హోటల్‌ వద ్ద ఈనెల 22న తెల్లవారుజామున ఇద్దరు యువకులను చంపుతామం టూ బెదిరించి వారి వద్ద దోచుకొన్న వస్తువులతో పరారైన ఆరుగురు వ్యక్తుల్లో నలుగురుని కోటనందూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అల్లాది నాగేంద్రసాయి, గాలంకి కిరణ్‌బాబు లంబసింగి విహారయాత్రకు వెళ్లి తిరివస్తుండగా కాకరాపల్లి వద్ద అరుగురు వ్యక్తులు రెండు స్కూటీలపై వచ్చి వారిని బ్యాట్‌తో అడ్డగించి చెంపపై కొట్టారు. వారి వద్ద ఉన్న బజాజ్‌ పల్సర్‌ బైక్‌, 2 మొబైల్‌ ఫోన్లు, దుస్తుల బ్యాగ్‌, రూ.1400 నగదు పట్టుకునిపోయారు. దీంతో బాధితులు పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. స్పెషల్‌ క్లూస్‌ టీం రంగంలోకి దిగి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో కాకినాడకు చెందిన పట్టెంకామరాజు, గుటూరి సాయి దుర్గాప్రసాద్‌, సంగు నాగవెంకట భవాని కుమార్‌, చింతా పవన్‌కళ్యాణ్‌తో పాటు చల్లా నాగ శివమణికంఠ, ఏనుగుపల్లి రాజు ఉన్నారు. వారందరు శుక్రవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గాంధీనగరం- తాండవ జంక్షన్‌ మధ్య ఫారెస్ట్‌ టేక్‌ ప్లాంటేషన్‌ వద్ద గుమికూడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కోటనందూరు సీఐ జిచెన్నకేశవరావు, ఎస్‌ఐ టి.రామకృష్ణ, సీపీఎస్‌ ఎస్‌ఐ అంకబాబు ఆధ్వర్యంలో అక్కడకు వెళ్లి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఏనుగపల్లిరాజు, చల్లా నాగశివమణికంఠ పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన నిం దితుల నుంచి పల్సర్‌బైక్‌ సుజుకీస్కూటీ, హోం డా ఎక్టివా, నాలుగు మొబైల్‌ఫోన్లు, క్రికెట్‌ బ్యా ట్‌, రూ.1400 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టుకు తరలించామని, మిగిలిన ఇద్దరిని కూడా త్వరలో పట్టుకుంటామని ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:34 AM