Share News

ఆంధ్రజ్యోతి పంచిన ఆనందం

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:42 AM

మా అక్షరం మీ ఆయుధం అనే నినాదంతో ప్రజల తరపున పోరాడే ఏకైక దమ్మున్న పత్రిక ఆంధ్రజ్యోతి అని రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువులోని ఆంధ్రజ్యోతి జిల్లా యూనిట్‌ కార్యాలయంలో సోమవారం ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌రేస్‌ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి పంచిన ఆనందం
ప్రథమ బహుమతి గ్రహీత, టీఎన్‌వీఎస్‌ సూర్యనారాయణమూర్తికి నగదు చెక్కు

  • ప్రజల తరపున పోరాడే దమ్మున్న పత్రిక.. ఆంధ్రజ్యోతి

  • రుడా చైర్మన్‌ బొడ్డు వెంకట రమణ చౌదరి

  • ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ డ్రా విజేతలకు బహుమతులు అందజేత

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మా అక్షరం మీ ఆయుధం అనే నినాదంతో ప్రజల తరపున పోరాడే ఏకైక దమ్మున్న పత్రిక ఆంధ్రజ్యోతి అని రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువులోని ఆంధ్రజ్యోతి జిల్లా యూనిట్‌ కార్యాలయంలో సోమవారం ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌రేస్‌ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. అశేష పాఠకాదరణ ఆంధ్రజ్యోతి సొంతమన్నారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం పాఠకులకు బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగిశెట్టి చంటిబాబు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయం మా రాజానగరం నియోజకవర్గంలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రజ్యోతి బీఎం ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠకులను ప్రోత్సహించడానికి కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి కార్‌అండ్‌ బైక్‌ రేస్‌ లక్కీడ్రా నిర్వహిస్తోందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గతేడాది నవంబరు ఒకటవ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వతేదీ మధ్య ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన 12 కూపన్లను నాలుగు సెట్లు చేసి పాఠకులు ఆంధ్రజ్యోతి కార్యాలయానికి పంపారని తెలిపారు. వాటిని ఇటీవల డ్రా తీసి విజేతలను ఎంపిక చేశామన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం మందపల్లికి చెందిన టీఎన్‌వీఎస్‌.సూర్యనారాయణమూర్తికి ప్రథమ బహుమతిగా బైక్‌ నిమిత్తం నగదు చెక్కు అందజేశారు. సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడుకు చెందిన అడబాల సత్యనారాయణకు ద్వితీయ బహుమతిగా ఫ్రిడ్జ్‌ నిమిత్తం కొనుగోలు పత్రం, రామచంద్రపురానికి చెందిన ములసా అప్పలరాజుకు తృతీయ బహుమతిగా 32 ఇంచెస్‌ టీవీ నిమిత్తం కొనుగోలు పత్రం అందజేశారు. మరో 100మంది విజేతలకు కన్సొలేషన్‌ బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి విజేతకు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కందుల బాబూరాయుడు, టీడీపీ నాయకులు షోడసాని త్రిమూర్తులు, పలివెల లక్ష్మణ్‌, పెనుగొండ చిన్ని, ఆంధ్రజ్యోతి యాడ్స్‌ మేనేజర్‌ పి.వి.కృష్ణారావు, సర్క్యులేషన్‌ మేనేజర్‌ బి.గోపాలకృష్ణ, స్టాఫ్‌ రిపోర్టర్‌ పి.రమేష్‌నాగేంద్ర, రిపోర్టర్లు ప్రగడ దుర్గారావు, కాదంబరి శ్రీనివాస్‌, కవిరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రథమ బహుమతి వస్తుందనుకోలేదు

ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ డ్రాలో ప్రథమ బహుమతి అందుకోవడం అంతులేని ఆనందం కలిగించింది. పౌరోహిత్యం మా వృత్తి. దాదాపు 22సంవత్సరాలకు పైగా ఆంధ్రజ్యోతి పాఠకుడను. ఆంధ్రజ్యోతి బైక్‌ అండ్‌ కార్‌ రేస్‌ కూపన్లు పూర్తి చేసి పంపాను. ఊహించని విధంగా ప్రథమ బహుమతి లభించింది.

-ప్రథమ బహుమతి గ్రహీత, టీఎన్‌వీఎస్‌ సూర్యనారాయణమూర్తి, మందపల్లి, కొత్తపేట మండలం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

అంతులేని సంతోషం కలిగింది

మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి నుంచి బహుమతి అందుకున్నాం. గతంలో పజిల్స్‌ పూర్తి చేసి పంపినప్పటికీ బహుమతి రావడం మాత్రం ఇదే. మా అభిమాన పత్రిక ఆంధ్రజ్యోతి నుంచే ఆ బహుమతి అందుకోవడం అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. గత పదిహేను సంవత్సరాలుగా మేము ఆంధ్రజ్యోతి పత్రిక చదువుతున్నాం.

-ద్వితీయ బహుమతి గ్రహీత, అడబాల సత్యనారాయణ, శృంగవరప్పాడు, సఖినేటిపల్లి మండలం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

మేము ఆంధ్రజ్యోతి అభిమానులం

మేము ఆంధ్రజ్యోతి పత్రికను ఎంతగానో అభిమానిస్తాం. పత్రిక ఎంతో బాగుంటుంది. గతంలో వేరే పత్రిక చదివే మేము రెండు సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి చందాదారులం అయ్యాం. కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ కూపన్లు పూర్తి చేసి పంపే సందర్భంలో ఇందులో బహుమతి వస్తే బాగుండునని అనుకున్నాం. అదృష్టం కలిసివచ్చి బహుమతి అందుకున్నాం.

-తృతీయ బహుమతి గ్రహీత, ములస అప్పలరాజు, రామచంద్రపురం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Updated Date - Apr 22 , 2025 | 12:42 AM