Share News

వచ్చే నెల 7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:23 AM

అన్నవరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): అన్నవరం సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమయ్యారు. మే నెల 7 నుంచి 13 వరకు వార్షిక కల్యాణోత్సవాలు జరగనుండగా 8న రాత్రి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరగనుం ది. దీనికి సంబంధించి ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌, ప్రత్తిపాడు సీఐతో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానం

వచ్చే నెల 7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఈవో, చైర్మన్‌, ప్రత్తిపాడు సీఐ

8న రాత్రి దివ్యకల్యాణం, భక్తులు వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు

అక్షింతల కోసం వివిధ ప్రాంతాల్లో 9 కౌంటర్లు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖలకు లక్ష్యాలు

ఏర్పాట్లపై దేవస్థానం అధికారుల సమీక్ష సమావేశం

అన్నవరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): అన్నవరం సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమయ్యారు. మే నెల 7 నుంచి 13 వరకు వార్షిక కల్యాణోత్సవాలు జరగనుండగా 8న రాత్రి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరగనుం ది. దీనికి సంబంధించి ఏర్పాట్లపై బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్‌ రోహిత్‌, ప్రత్తిపాడు సీఐతో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా 8వ తేదీన తెలుగురాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కల్యాణం వీక్షించేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో వివిధ శాఖ ల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. 23 అంశాల అ జెండాగా ప్రవేశబెట్టిన ఈ సమావేశంలో దేవస్థానం అధికారులతో పాటుగా 9 శాఖలు భాగస్వామ్యం కానున్నాయి. కల్యాణోత్సవాల్లో ప్రతిరోజు వైదిక కార్యక్రమాలు నిర్దిష్ట సమయంలో నిర్వహించాలని, ఈ బాధ్యతను వైదికకమిటీ, ఇద్దరు ఏఈవోలు, ఇద్దరు సూపరింటెండెంట్లకు అప్పగించారు. 8న కల్యా ణం రోజున బ్లాక్‌లు వారీగా ఏర్పాటుచేసి ప్రముఖులు, ఇతరులకు నిర్దేశించిన ప్రదేశాల్లో క్యూలైన్‌ వ్యవస్థ దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగానికి అప్పగించారు. కల్యాణం అనంతరం వేదికవద్దకు ఎవ్వరూ అక్షింతల కోసం రాకుండా వివిధ ప్రాంతాల్లో 9 కౌంటర్ల ద్వారా తలంబ్రాల అక్షింతలు, ప్రసాదవితరణ చేయాలని సూచించారు. అన్ని వైపుల నుంచి భక్తులు కల్యాణోత్సవాలు వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేయనున్నా రు. భక్తులకు ఎక్కడికక్కడ తాగునీరందించాలని సేవాసంస్థల సభ్యుల సహకారంతో పాటుగా వాటర్‌వర్క్స్‌ విభాగం బాధ్యతలు తీసుకోవాలన్నారు. కల్యాణంరోజున భక్తులను ఉచిత రవా ణా సౌకర్యం ఏర్పాట్లను దేవస్థానం రవాణావిభాగం పర్యవేక్షించాలని సూచించారు. కల్యాణోత్సవాల వారంరోజులు కొండదిగువన జరిగే గ్రా మసేవల బాధ్యతలు డీఈలకు అప్పగించారు. వారంతా వాహనసేవల్లో వినియోగించే వాహనా ల ఫిట్‌నెస్‌సర్టిఫికెట్‌ తీసుకోవాలని పేర్కొన్నారు.

ఏఏ శాఖలకు..ఏ బాధ్యతలు..

గ్రామసేవల సమయంలో, రత్నగిరిపై కల్యాణోత్సవ వేళ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా, ట్రాఫిక్‌ అంతరా యం కలగకుండా చూసే బాధ్యతను పోలీస్‌శాఖకు అప్పగించారు. ప్రధానంగా 11న జరిగే పెద్దరథం ఊరేగింపు సాయంత్రం 4గంటలకు ప్రార ంభించాలని సూచించారు. గ్రామసేవలు జరిగే సమయాల్లో వాహనాలను బైపాస్‌ రోడ్డు గుండా మళ్లించాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌ను నిర్దేశిత ప్రాంతాల్లో ఉంచాలని దీనికి సైన్‌బోర్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సత్యదేవుని చక్రస్నానం రోజున పంపా రిజర్వాయిర్‌లో తగినంత నీటినిల్వ ఉండేలా చూడాలని ఇరిగేషన్‌శాఖకు... కల్యాణోత్సవాలు, ఊరేగింపుల సమయంలో గ్రామంలో, కొండపైన విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూడాలని ఏపీ ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. 24 గంటలు కొండపైన, మెడికల్‌ క్యాంప్‌లతో పాటుగా 108 అం బులెన్స్‌ సిద్ధంగా ఉంచాలని వైద్యఆరోగ్యశాఖకు.. స్వామి కల్యాణంరోజున, శ్రీపుష్పయోగం రోజున ఫైరింజన్‌ అందుబాటులో ఉంచాలని ఫైర్‌శాఖ కు, నిరంతరాయంగా ఆర్టీసీబస్సులు నడపాలని, ఆర్టీసీ అధికారులకు కల్యాణం రోజున మధ్యా హ్నం 2 గంటల నుంచి గ్రామంలో మద్యందుకాణాలు మూయించడమే కాకుండా మిగిలిన రో జుల్లో గ్రామసేవల సమయంలో మద్యం దుకాణాల వద్ద అవాంఛనీయసంఘటనలు లేకుండా చూడాలని ఎక్సైజ్‌శాఖకు... గ్రామంలో శానిటేష న్‌, ఊరేగింపు సమయంలో పసుపునీళ్లతో శుభ్రం చేసే బాధ్యతను, మెయిన్‌రోడ్డులో సెంట్రల్‌లైటింగ్‌ మరమ్మతులు, 11న రథోత్సవంలో మెయిన్‌రోడ్డుపై ఉన్న దుకాణసముదాయాలు మూ యించే బాధ్యతను పంచాయితీకి అప్పగించారు.

Updated Date - Apr 24 , 2025 | 12:23 AM