Share News

ముళ్ల కంచెలో ముక్కుపచ్చలారని పసిబిడ్డ

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:25 AM

నల్లజర్ల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో మంగళవారం అమానుష ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం- యర్నగూడెం రోడ్డులో పొగాకు బ్యారన్స్‌ దగ్గర ఉన్న ముళ్లపొదల్లో ముక్కపచ్చలారని ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. ఉదయం పాలు తీసుకురావాడానికి అటుగా వె ళ్తున్న రైతులు శిశువును కుక్కలు పీక్కుతినడం చూసి వాటి నుంచి శిశువును కాపాడి వైద్య సిబ్బం

ముళ్ల కంచెలో ముక్కుపచ్చలారని పసిబిడ్డ
పోతవరం పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

పోతవరంలో అమానుషం

కుక్కలు పీక్కు తింటుండగా అడ్డుకున్న రైతులు

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి విషమం

నల్లజర్ల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో మంగళవారం అమానుష ఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం- యర్నగూడెం రోడ్డులో పొగాకు బ్యారన్స్‌ దగ్గర ఉన్న ముళ్లపొదల్లో ముక్కపచ్చలారని ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. ఉదయం పాలు తీసుకురావాడానికి అటుగా వె ళ్తున్న రైతులు శిశువును కుక్కలు పీక్కుతినడం చూసి వాటి నుంచి శిశువును కాపాడి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. ఏఎన్‌ఎం మహాలక్ష్మి,గ్రామ సంరక్షణ అధికారి దీపక సం ఘటనా స్థలానికి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న శిశువును తీసుకుని వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం డాక్టర్‌ రాజశేఖర్‌ శిశువును పరిశీలించి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువుకు డీఎన్‌ ఏ పరీక్షలు నిర్వహించి రక్తం ఎక్కించారు. నల్లజర్ల సీఐ వై.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లిన సీఐ సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీడీపీవో నాగలక్ష్మి, ఏసీడీపీవో పద్మావతి, సూపర్‌వైజర్‌ వెంకటలక్ష్మి ఏలూరు వెళ్లి శిశువును పరిశీలించి సంరక్షణ కోసం ఇద్దరి ఆయాలను అక్కడ ఉంచారు. మరో 48 గంటలు దాటితే తప్ప ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపినట్టు సీడీపీవో నాగలక్ష్మి తెలిపారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డను ముళ్ల కంచెలో విసిరి వేయడానికి మనసు ఎలా వచ్చిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పోతవరంలో ఇతర ప్రాంతాల నుంచి పొగాకు పనులు చేసుకునేవారు వందల సంఖ్యలో ఉంటారని, వారే గుట్టుచప్పుడు కాకుండా శిశువును విసిరి వేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:25 AM