కంపు కొడుతున్న కార్పొరేషన్
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:07 AM
రాజమహేంద్రవరాన్ని పరిశుభ్రంగా ఉంచు దాం.. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుద్దాం.. అంటూ ఒక పక్క నినాదాలతో మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ హోరెత్తిస్తున్నారు. తీరా నగరంలో కంటే కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో వాస్తవ స్థితి అధ్వానంగా ఉంది. రాజమహేంద్రవరం నగర పాల క సంస్థ కార్యాలయమా ? లేక డంపింగ్ యార్డా అన్నట్లుగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం మారిపోయింది.
ఆక్రమణల తొలగింపు వ్యర్ధాలతో నిండిపోయిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రాంగణం
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్ 17(ఆంధ్ర జ్యోతి): సొంత ఇళ్లే చక్కబెట్టుకోలేని వారు ఊరిని ఉద్ధరిస్తారా అని రాజమహేంద్రవరం సిటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.. అలా అని ఎం దుకు అంటున్నారంటే..
రాజమహేంద్రవరాన్ని పరిశుభ్రంగా ఉంచు దాం.. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుద్దాం.. అంటూ ఒక పక్క నినాదాలతో మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ హోరెత్తిస్తున్నారు. తీరా నగరంలో కంటే కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో వాస్తవ స్థితి అధ్వానంగా ఉంది. రాజమహేంద్రవరం నగర పాల క సంస్థ కార్యాలయమా ? లేక డంపింగ్ యార్డా అన్నట్లుగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం మారిపోయింది. నగరం లో ఆక్రమణల తొలగింపుల్లో తీసుకొచ్చిన వాటి తో అదొక చెత్త కూపంగా తయారైంది. నగరంలో రహదారులను ఆక్రమంచిన చిరువ్యాపారులు, రోడ్డు పక్కన పెట్టిన తోపుడు బళ్లు, పైప్‌లు, ఫ్లెక్సీలు, జెండాలు, ఇలా అనేక రకాల వేస్ట్ మెటీరియల్‌ను కార్పొరేషన్‌కు తరలించి అధికారులు వాటిని పార్కులో కుప్పలుగా పోసి వదిలేశారు. ఇవి నెలల తరబడి అలాగే ఉండిపోయి చెత్తగా మారిపోయాయి. వాటిలో పురుగుపుట్ర చేరి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఫ్లెక్సీలు చిన్నపాటి మురుగునీటి మడుగుల్లా మారి దోమల ఉత్పత్తి కేంద్రాలయ్యాయి. అటుగా వెళ్తేనే దారుణంగా కంపుకొడుతోంది. పరిశుభ్రతగా ఉంచండని ప్రజలను చైతన్యం చేయడానికి ఏర్పాటు చేసిన మంకీ డస్ట్ బిన్నులు ఇప్పుడు వేస్ట్‌లో చేరిపోయాయి. తినేసి వదిలేసిన భోజనాల ప్యాకెట్లు కుళ్లిపోయి దర్శనమిస్తున్నాయి. ఇలాగే వుంటే రోగాలు ప్రజలకు కాదు కార్పొరేషన్ సిబ్బందికే ముందు వచ్చే ప్రమాదముంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు చెబుతున్న అధికారులు తమ కార్యాలయాన్నే అపరిశుభ్రంగా ఉంచుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది.